స్పెషల్ అట్రాక్షన్ గా ప్రభాస్ కటౌట్..!

Published on Jun 15, 2022 2:04 pm IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి సాలిడ్ కటౌట్స్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకడు. ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ ఈరోజు ఉదయం తన దర్శకుడు ఓంరౌత్ ఇంటి దగ్గర కనిపించాడు. అయితే వీరి కాంబోలో వస్తున్న “ఆదిపురుష్” టీం అంతా రీయూనియన్ కాగా వీరి అందరి కలయికలో మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా ప్రభాస్ సాలిడ్ కటౌట్ నిలిచింది అని చెప్పాలి. సలార్ లుక్ లో ఫార్మల్స్ వేసుకొని డార్లింగ్ ఓ రేంజ్ లో కనిపిస్తున్నాడు.

దీనితో ఈ అందరిలో కూడా ప్రభాస్ చాలా స్పెషల్ గా కనిపించాడు. దీనితో ఈ డ్రెస్సింగ్ లో ప్రభాస్ లుక్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా ప్రభాస్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు తెలిసింది. ప్రభాస్ కటౌట్ ని ఎలా వాడాలో అంతకు కొన్నింతలు ఎక్కువగానే సలార్ లో ఉంటుంది అని తెలిపాడు. దీనితో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :