క్రేజీ..”ఆదిపురుష్” లో మీరు ఊహించని రీతిలో ప్రభాస్ కటౌట్.?

Published on May 13, 2022 10:30 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ మైథలాజికల్ వండర్ “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

అయితే గతంలో ఈ సినిమాలో రావణ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ ని దాదాపు 7 అడుగులు ఉండే భారీ కాయంతో చూపించనున్నారని ఒక క్రేజీ బజ్ వచ్చింది. అయితే తర్వాత మళ్ళీ దీనిపై అలాంటివి లేవు అన్నట్టు క్లారిటీ రాగా మళ్ళీ బాలీవుడ్ వర్గాల నుంచి ఇప్పుడు ప్రభాస్ పై క్రేజీ బజ్ వినిపిస్తుంది.

ప్రభాస్ కటౌట్ ని ఈ సినిమాలో శ్రీరామునిగా ఏకంగా 8 అడుగులు ఉండేలా డిజైన్ చేసారని తెలుస్తుంది. అలాగే దీనికి బలమైన కారణం కూడా ఉందట. వాల్మీకి రామాయణం ప్రకారం కొన్ని ఆధారాల ద్వారా శ్రీరాముడు 8 అడుగులు ఉంటాడని ఆ కారణంగా ఈ సినిమాలో కూడా ప్రభాస్ ని అంతే రీతిలో చూపిస్తున్నారని వినికిడి.

మరి ఇది అయితే విజువల్ గా ఓ రేంజ్ లో ఉంటుంది అని చెప్పాలి. అయితే అందుకు గ్రాఫిక్స్ కూడా చాలా కీలకంగా ఉండే అంశం మరి మేకర్స్ ఇలాంటి ప్రయోగాలు ఎంత సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేసారో చూడాలి.

సంబంధిత సమాచారం :