హను పదేళ్ల సినీ కెరీర్ పై ప్రభాస్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Aug 11, 2022 1:10 am IST

టాలీవుడ్ కి సరిగ్గా పదేళ్ల క్రితం విడుదలై మంచి సక్సెస్ అందుకున్న అందాల రాక్షసి మూవీతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు హను రాఘవపూడి. ఆ మూవీలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి పెర్ఫార్మన్స్, హీరోలుగా నటించిన నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ ల ఆకట్టుకునే నటన, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి అలరించే టేకింగ్, డైరెక్టరల్ స్కిల్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి.

మొత్తంగా ఆ మూవీ తరువాత ఎంతో సెలెక్టీవ్ గా మూవీస్ చేస్తూ కొనసాగిన హను లేటెస్ట్ గా దుల్కర్, మృణాల్ ఠాకూర్ లతో తెరకెక్కించిన మూవీ సీతారామం. ప్రస్తుతం ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. కాగా నేటితో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా హను రాఘవపూడి పదేళ్లు కంప్లీట్ చేసుకోవడంతో ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజక్ట్ కె వంటి భారీ పాన్ వరల్డ్ మూవీ తీస్తున్న యువ దర్శకుడు నాగ అశ్విన్ ఆయన పై ప్రశంసలు కురిపించారు. సరిగ్గా పదేళ్ల క్రితం పివిఆర్ థియేటర్ లో హను గారి ఫస్ట్ మూవీ అందాల రాక్షసి చూసాను. ఫస్ట్ మూవీతోనే ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకుడిగా మాదిరిగా హృదయానికి హత్తుకునేలా ఆయన మూవీని నడిపిన తీరు ఎంతో నచ్చింది. అలానే అందులోని సాంగ్స్, విజువల్స్, లవ్, రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్ అయితే ఎప్పటికీ మర్చిపోలేను.

అలానే ఒక కథకు అన్ని మంచి అంశాలు కలిసివస్తే తప్పకుండా అది విజయవంతం అవుతుందని అంటారు హను. ఇక ప్రస్తుతం అదే వైజయంతి వారు బ్యానర్ పై హను తీసిన సీతారామం విషయంలో కూడా జరగడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ నాగ అశ్విన్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది. అలానే ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావించవలసిన విషయం ఏమిటంటే, మా 123తెలుగు సైట్ లో హను రాఘవపూడి పదేళ్ల ప్రస్థానం తాలూకు పోస్ట్ చేయబడ్డ ఆర్టికల్ తనకు నచ్చడంతో దానిని తన ఇన్స్టా స్టోరీ పోస్ట్ లో షేర్ చేసిన నాగ అశ్విన్ గారికి స్పెషల్ థాంక్స్ చెప్తోంది మా టీమ్.

సంబంధిత సమాచారం :