ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు ప్రభాస్ 1 కోటి భారీ విరాళం..!

Published on Dec 7, 2021 11:41 am IST

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఎంత కల్లోలం జరిగిందో తెలిసిందే. మరి ఈ దుర్ఘటనకు గాను టాలీవుడ్ స్టార్ నటులు స్పందించి ఒక్కొక్కరు 25 లక్షల చొప్పున సాయం అందించారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఉన్నతమైన మనసు చాటుకొని భారీ సాయం అందించారు. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేసారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు మంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నారు.

తాజాగా ప్రభాస్ కూడా అనౌన్స్ చేసారు. ఈయన కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ఈయన భారీగానే విరాళాలు అందచేసారు. హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు ప్రభాస్. ఇక కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. ఇలా అవసరం అనుకున్న ప్రతీసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు రెబల్ స్టార్. ఈయన పెద్ద మనసుకు అభిమానులతో పాటు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :