మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్..!

Published on Mar 15, 2022 11:49 pm IST


పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. రాధేశ్యామ్ సినిమా విడుదల రోజు ప్రమాదవశాత్తు చనిపోయిన అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించాడు. గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్‌ థియేటర్‌ వద్ద చల్లా కోటేశ్వర రావు అనే అభిమాని ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ తీగలపై పడి మృతిచెందాడు.

అయితే ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభాస్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రభాస్ అభిమాని మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ అతడి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించాడు. అంతేకాదు అతడి ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :