ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో తాను క్యామియో పాత్రలో చేస్తున్న పాన్ వరల్డ్ చిత్రం కూడా ఉంది. మరి ఆ సినిమానే మంచు విష్ణు హీరోగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం “కన్నప్ప”. అయితే ఈ సినిమా షూటింగ్ లో రీసెంట్ గానే ప్రభాస్ జాయిన్ కాగా నిన్ననే మంచు విష్ణు పలు ఆసక్తికర అంశాలు రివీల్ చేసాడు.
ప్రభాస్ కి కథ చెప్పినప్పుడు ఓ పాత్ర విషయంలో తాను చాలా ఎగ్జైట్ అయ్యాడు అని మరి దానిని తన కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్టుగా తెలిపాడు. అయితే అసలు తనకి ఓ పాత్ర చెబితే తాను ఇంకొక పాత్ర విషయంలో అంతలా ఎగ్జైట్ కావడం ఆసక్తిగా మారింది అని చెప్పాలి.
తనని అంతలా మెప్పించిన ఆ పాత్ర ఏమిటో అని అభిమానులు కూడా మరింత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభాస్ ని అంతలా మెప్పించిన ఆ పాత్ర ఏమిటో అనేది మరికొంత కాలం వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో అక్షయ్ కుమార్ మోహన్ లాల్ ఇంకా అనేకమంది భారీ తారాగణం నటిస్తున్నారు.