ప్రభాస్ కోసం టవరెక్కిన డై హార్డ్ ఫ్యాన్

Published on Sep 12, 2019 11:19 am IST

నిన్న ప్రభాస్ ఫ్యాన్ ఒకరు పోలీసులకు, జనాలకు చెమటలు పట్టించాడు. అతను సెల్ టవర్ ఎక్కి కొద్దిసేపు ఉత్కంఠ వాతావరణాన్ని నెలకొల్పాడు. వివరాల్లోకి వెళితే తెలంగాణాకు చెందిన ఓ అభిమాని సెల్ టవర్ ఎక్కి హీరో ప్రభాస్ ఇక్కడి రావాలని డిమాండ్ చేశారు. హీరో ప్రభాస్ వచ్చే వరకు సెల్ టవర్ దిగేదిలేదంటూ, రాని పక్షంలో దూకి ప్రాణాలు తీసుకుంటానని బెదిరించాడు. ఐతే ఎట్టకేలకు అతన్ని ఒప్పించి కిందకు దింపారని సమాచారం.

ప్రభాస్ ఫ్యాన్ చేసిన ఈ పనికి నిజంగానే ఇలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారా అనిపించడం ఖాయం. కాగా ఇటీవల విడుదలైన సాహో ప్రపంచ వ్యాప్తంగా 400కోట్ల వసూళ్ల వరకు సాధించి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంది. ప్రభాస్ తన తదుపరి చిత్రం దర్శకుడు రాధా కృష్ణతో చేస్తున్నారు. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ అని సమాచారం. ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More