రాధే శ్యామ్ స్టైల్ లో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!

Published on Jan 14, 2022 1:34 am IST

పాన్ ఇండియా స్టార్, ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ రాధే శ్యామ్ నిరవధికంగా వాయిదా పడింది. ఈ వార్త స్టార్ హీరో అభిమానులను నిరాశకు గురి చేసింది. కానీ, ఈ సంక్రాంతిని జరుపుకోవాలని ఓ క్రేజీ ఐడియాతో వచ్చారు అభిమానులు. రాధే శ్యామ్ స్టిల్స్‌తో అతని అభిమానులు పర్యావరణ అనుకూలమైన గాలిపటాలను తయారు చేశారు.

అభిమానులు తయారు చేసిన కస్టమైజ్డ్ పతంగులు అందరినీ ఆకట్టుకున్నాయి. కొన్ని వారాల క్రితం, ఆయన అభిమానులు కూడా రాధే శ్యామ్ యొక్క సంగీత పర్యటనను ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో నిర్వహించారు. మరి రానున్న రోజుల్లో రాధే శ్యామ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :