ప్రభాస్ సినిమా థియేటర్‌ లో మంటలు.. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ !

ప్రభాస్ సినిమా థియేటర్‌ లో మంటలు.. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ !

Published on Oct 23, 2022 3:00 PM IST

నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టనరోజు. కాగా ప.గో. జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల మూసేసిన వెంకట్రామ థియేటర్‌లో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు అందులో బిల్లా స్పెషల్ షో వేయించారు. ఈ షోకి ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎత్తున హాజరు అయ్యారు. అయితే, ప్రభాస్ ఫ్యాన్స్ లో కొందరు థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు.

సినిమా చూస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్‌లో బాణసంచా పేల్చారు. ఈ సందర్భంగా అనుకోకుండా సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో థియేటర్ మొత్తం మంటలు అంటుకున్నాయి. వెంటనే తేరుకున్న ప్రభాస్ అభిమానులు మరియు థియేటర్ యాజమాన్యం ఆ మంటలను ఆర్పేశారు. మొత్తానికి ప్రభాస్ పుట్టనరోజు నాడు పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, సినిమాని షో మధ్యలో ఆపినందుకే కొందరు ఫ్యాన్స్ మంటలు పెట్టారని టాక్ నడుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు