“ఆదిపురుష్” విషయంలో ఫ్యాన్స్ ఇండియన్ లెవెల్లో ట్రెండ్.!

Published on May 23, 2022 9:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో పాన్ ఇండియా లెవెల్ నుంచి పాన్ వరల్డ్ స్థాయి వరకు పలు సినిమాలు ఉన్నాయి. అయితే వాటి అన్నిటిలో చాలా గుప్తంగా ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం “ఆదిపురుష్” అని చెప్పాలి.

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా ఇండియన్ సినిమా దగ్గర ఒక బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా పట్ల మేకర్స్ ఎంత కేర్ గా ఉన్నారంటే ఇప్పటి వరకు వారు రిలీజ్ చేసిన ఫోటో తప్ప ఏ చిన్న లీక్ కూడా ఈ సినిమా నుంచి రాలేదు. అంత జాగ్రత్తగా ఈ సినిమా విషయంలో వారు ఉన్నారు. ఇది ఒక మంచి విషయం.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా నుంచి రోజులు గడుస్తున్నా ఇంకా ఒక సరైన అప్డేట్ రాకపోవడంతో కాస్త నిరాశలోనే ఉన్నారు. దీనితో ఇప్పుడు ట్విట్టర్ లో ఆదిపురుష్ టీం పై ట్రెండ్ చేస్తున్నారు. “వేక్ అప్ ఆదిపురుష్ టీం” అంటూ అప్డేట్ కోసం ట్రెండ్ చేస్తుండగా అది కాస్తా ఇప్పుడు 50 వేలకి పైగా ట్వీట్స్ తో ఏకంగా ఇండియన్ ట్రెండ్స్ లో వైరల్ అవుతుంది. మరి ఇది సినిమా యూనిట్ వరకు వెళ్లి ఏమన్నా స్పెషల్ అప్డేట్ అందిస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :