ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ బిజీగా ఉన్న టాప్ హీరోస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ అన్ని సినిమాలపై భారీ అంచనాలు నెలకొనగా వీటిలో ప్రతి సినిమాలో కూడా ఒకో కొత్త లుక్ లో ప్రభాస్ కనిపించనున్నారు. అయితే ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా హను రాఘవపూడి కలయికలో చేస్తున్న సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన లుక్ వైరల్ గా మారింది.
అయితే ఈ లుక్ విషయంలో సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే అభిమానులు కూడా ప్రభాస్ లుక్స్ పట్ల డిజప్పాయింట్ అయ్యారని తెలుస్తోంది. ఇది వరకు సూపర్ స్మార్ట్ గా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు కొంచెం బొద్దుగా కనిపించడంతో ఇవి వైరల్ గా మారాయి. మరి మళ్లీ ప్రభాస్ స్మార్ట్ లుక్ లో ఎపుడు కనిపిస్తాడో చూడాల్సిందే.