‘సాహో’ బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ !

Published on Aug 13, 2019 3:01 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం ‘సాహో’. కాగా అగ‌ష్టు 30న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది. అయితే ‘సాహో’ సినిమా బడ్జెట్‌ పై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. వాటిల్లో ప్రధానంగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు రూమర్ ఎక్కువుగా వినిపించింది.

కాగా తాజాగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా బడ్జెట్‌ అక్షరాల రూ. 350 కోట్లు అని.. ఇది ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్ కాదని.. ఇది ప్రస్తుతం నడిచే కథ అని, సినిమాలో కొన్ని పార్ట్స్‌ ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయని.. ఈ సినిమాని మేం పెద్దస్థాయిలో తీశాం అని ప్రభాస్ స్పష్టం చేశారు.

కాగా ప్రస్తుతం సాహో ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :