‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌కు డేట్ ఫిక్స్

‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌కు డేట్ ఫిక్స్

Published on Jan 27, 2025 5:07 PM IST

టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కన్నప్ప’ భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మైథలాజికల్ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుండటంతో ఈ మూవీపై అన్ని భాషల్లోని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో అందరి చూపులు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేమియో పై పడ్డాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందా అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. అయితే, ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసేందుకు ‘కన్నప్ప’ మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవలోని ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను ఫిబ్రవరి 3న రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌తో ఈ అనౌన్స్‌మెంట్‌ను చేశారు. ఇక దీంతో ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్‌లో కూడా ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు