క్రేజీ బజ్ : “భక్త కన్నప్ప” లో ప్రభాస్ ఫిక్స్డ్

Published on Sep 10, 2023 10:00 am IST

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న కొని ఎవర్ గ్రీన్ చిత్రాల్లో దివంగత హీరో కృష్ణం రాజు చేసిన భక్త కన్నప్ప చిత్రానికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ చిత్రాన్ని మళ్ళీ తెరకెక్కించే సాహసం అయితే ఎవరూ చేయలేదు. కానీ ఈ చిత్రానికి సంబంధించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రెజెన్స్ ఉండొచ్చు అనే టాక్ మాత్రం ఎప్పటి నుంచో ఉంది. మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో ఇంట్రెస్టింగ్ అంశం ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.

మరి మంచు వారి హీరో మంచు విష్ణు హీరోగా రీసెంట్ గా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా “భక్త కన్నప్ప” చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ప్రభాస్ ఓ సాలిడ్ క్యామియో రోల్ లో కనిపించేందుకు అంగీకరించాడు అని ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. అయితే దీనిపై అధికారిక అనౌన్సమెంట్ లేదు కానీ ప్రభాస్ అయితే ఈ సినిమాలో కనిపించడం కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యింది. మరి దీనితో అయితే ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్లనుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :