“బ్రహ్మాస్త్ర2” కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్?

“బ్రహ్మాస్త్ర2” కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్?

Published on Nov 9, 2022 7:38 PM IST

బ్రహ్మాస్త్ర చాలా హైప్‌తో విడుదలైన పాన్ ఇండియా సినిమా. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర – దేవ్ అనే టైటిల్ తో రెండో భాగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మరో హీరో గా నటించేందుకు పలువురు హీరోల పేర్లను తీసుకుంటున్నారు మేకర్స్.

ఇప్పటి వరకు హృతిక్, షారూక్, సల్మాన్ ఖాన్ పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం డైరెక్టర్ అయాన్ ప్రభాస్ ని కూడా సంప్రదించాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్. ఇది ఊహాగానాలే అయినప్పటికీ, ఈ వార్త అంతటా బాగానే వ్యాపించింది. ఇప్పటికే మూడు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతాడో లేదో కాలమే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు