తన సాలిడ్ లైనప్ పై ప్రభాస్ క్లారిటీ వైరల్.!

Published on Apr 17, 2022 8:01 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా మరో రెండు చిత్రాలు షూట్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అయితే ప్రభాస్ ఈ రెండు సినిమాలు కాకుండా మరికొన్ని భారీ సినిమాలను తన లైనప్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే వాటిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

మరి రీసెంట్ గా ప్రభాస్ నేషనల్ మీడియా తో మాట్లాడిన మాటలు అంటూ కొన్ని వైరల్ అవుతున్నాయి. వాటి ప్రకారం అయితే ప్రభాస్ తన లైనప్ లో ఇంకా ఏకంగా 8 నుంచి 9 సినిమాలు ఉన్నాయని చెప్పడం వైరల్ గా మారింది. దీనితో రానున్న రోజుల్లో ప్రభాస్ నుంచి నిర్విరామ వర్క్ తో పాటు సాలిడ్ ట్రీట్ కూడా ఉంటుంది అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ప్రభాస్ తన భారీ సినిమా “సలార్” షూట్ కోసం సిద్ధం అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :