అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రభాస్ !
Published on Jul 9, 2017 5:48 pm IST


‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అన్ని భారతీయ భాషల పరిశ్రమల్లోనూ స్టార్ నటుడు. అయన చేయబోయే తర్వాత సినిమాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కూడా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు వీలైనన్ని ఎక్కువ భాషల్లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలా ప్రభాస్ పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం బాహుబలి చిత్రమే.

ఈ చిత్రం ఒక నటుడిగా ప్రభాస్ కు ఎన్ని ప్రయోజనాలు అందించాలో అన్నీ అందించింది. అంతేగాక తాజాగా దేశంలోని అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో కూడా ఆయన పేరు నిలిచేలా చేసింది. ప్రముఖ మ్యాగజైన్ జిక్యూ అన్ని రంగాల నుండి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో దక్షిణాది నుండి ప్రభాస్ ఒక్కడే ఎన్నిక కావడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ డైరక్షన్లో భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ లో నటిస్తున్నాడు.

 
Like us on Facebook