మొగల్తూరు లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి గ్రాండ్ వెల్కమ్ ….!

Published on Sep 29, 2022 4:37 pm IST

టాలీవుడ్ సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెల్సిందే. నటుడిగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకాభిమానులని అలరించడంతో పాటు రాజకీయాల్లో బిజెపి తరపున మంత్రిగా కూడా పని చేసి ఎన్నో ఎనలేని సేవలు అందించి, ఎందరికో సహాయం చేసి తన గొప్ప మనసుని చాటుకున్నారు కృష్ణంరాజు. ఇక ఆయన మరణించి నేటికి సరిగ్గా 18 రోజులు గడిచాయి.

కాగా నేడు ఆయన సంస్మరణ సభని ఆయన సొంత ఊరైన మొగల్తూరులో ఏర్పాటు చేసారు. వేలాదిగా ప్రేక్షకాభిమానులు ఈ సభకు విచ్చేయనుండగా ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే పలు రకాల పసందైన వంటలు సిద్ధం చేయించారు ప్రభాస్ కుటుంబసభ్యలు. అయితే కొద్దిసేపటి క్రితం కుటుంబంతో కలిసి మొగల్తూరు చేరుకున్న ప్రభాస్ కి అక్కడి ఫ్యాన్స్ నుండి గ్రాండ్ వెల్కమ్ లభించింది. డార్లింగ్ ఎంట్రీ తో అక్కడి ప్రాంతం అంతా కూడా కృష్ణంరాజు, ప్రభాస్ నినాదాలతో మారుమ్రోగిపోయింది. మొత్తంగా చాలా రోజుల తరువాత మొగల్తూరుకు తమ అభిమాన నటుడు విచ్చేయడంతో ఎంతో మంది ప్రభాస్ అభిమానులు ఆయనని చూసేందుకు తరలి వస్తున్నారు.

సంబంధిత సమాచారం :