స్టైలిష్ లుక్ లోకి మారనున్న ప్రభాస్
Published on Oct 14, 2017 6:49 pm IST

ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న పెద్ద స్టార్. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం సాహో షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఫోటో షూట్లు హైదరాబాద్ లో జరుగుతున్నాయి.

సాహో చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించేందుకు నిర్మాతలు చిన్న అవకాశాన్ని కూడా వదలి పెట్టడంలేదు. తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపిస్తాడట. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook