‘స్పిరిట్’ షూటింగ్ డిలే.. హాలీడేకు వెళ్లిన ప్రభాస్..!

Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమాల షూటింగ్ వల్ల ప్రభాస్ బాగా అలిసిపోయాడని.. అందుకే ఆయన సడెన్‌గా బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ వాస్తవానికి ఈ నెలకు ప్లాన్ చేసిన ఒక కీలకమైన షెడ్యూల్ అనూహ్యంగా మే నెలకు వాయిదా పడింది. ఈ మార్పుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. షూటింగ్ వాయిదా పడటంతో దొరికిన ఈ చిన్న విరామాన్ని ప్రభాస్ తన వ్యక్తిగత సమయం కోసం కేటాయించాడు. ఆయన ప్రస్తుతం వెకేషన్ నిమిత్తం యూరోప్ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ హాలిడే తర్వాత ప్రభాస్ తిరిగి వచ్చి మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ అవుతాడు.

అయితే, ‘స్పిరిట్’ షెడ్యూల్‌లో జరిగిన ఈ మార్పు ప్రభాస్ తర్వాతి ప్రాజెక్టులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చే నెలలో ప్రారంభం కావాల్సిన ‘కల్కి 2’ షూటింగ్ షెడ్యూల్‌లో కూడా కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version