‘క‌ల్కి’ రిలీజ్ వేళ యూర‌ప్ వెళ్తున్న‌ ప్ర‌భాస్..?

‘క‌ల్కి’ రిలీజ్ వేళ యూర‌ప్ వెళ్తున్న‌ ప్ర‌భాస్..?

Published on Jun 23, 2024 1:01 AM IST

ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రెస్టీజియ‌స్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ వచ్చే వారంలో రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి విజువ‌ల్ వండ‌ర్ మూవీగా ఇది రానుంది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మ‌రోసారి బాక్సాఫీస్ భ‌ర‌తం ప‌ట్టేందుకు రెడీ అయ్యాడు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు ఈ సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చిత్ర యూనిట్ ప‌క్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. అయితే, ప్ర‌భాస్ తాజాగా యూర‌ప్ వెళ్లనున్న‌ట్లుగా తెలుస్తోంది.

‘క‌ల్కి’ రిలీజ్ స‌మ‌యంలో ప్ర‌భాస్ ఇండియాలో అందుబాటులో ఉండ‌టం లేద‌ట‌. యూర‌ప్ లో ప్ర‌భాస్ ఓ విల్లాను కొన్నాడు. ఎప్పుడు బ్రేక్ తీసుకోవాల‌నుకున్నా, యూర‌ప్ వెళ్లేందుకు ప్ర‌భాస్ ఇష్ట‌ప‌డుతుంటాడు. ‘క‌ల్కి’ మూవీ రిలీజ్ స‌మ‌యంలో ప్ర‌భాస్ అన్నింటికీ దూరంగా.. కాస్త బ్రేక్ తీసుకునేందుకు యూరప్ వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ‘క‌ల్కి’ మూవీలో అమితాబ్ బచ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా పటాని త‌దితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు