ప్రభాస్ – హను రాఘవపూడి మూవీ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Published on Sep 26, 2023 12:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ అశ్విన్ తో కల్కి 2898 ఏడి అలానే మారుతీ తో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీస్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వీటి అనంతరం ఇప్పటికే సందీప్ రెడ్డి వంగాతో మాస్ యాక్షన్ మూవీ స్పిరిట్ ని కూడా అనౌన్స్ చేసారు ప్రభాస్. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం వీటితో పాటు ఇటీవల సీతారామం తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్న హను రాఘవపూడి తో కూడా ప్రభాస్ ఒక మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈమూవీ కి సంబంధించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ప్రచారం అవుతోంది. దాని ప్రకారం వరల్డ్ వార్ నేపథ్యంలో సాగె ప్రేమ కథగా ఇది రూపొందనుండగా మంచి లవ్, యాక్షన్, ఎమోషనల్ అంశాలతో దర్శకుడు హను ఈ మూవీని తెరకెక్కించనున్నారని అంటున్నారు. కాగా ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించనున్నారని టాక్. మరి ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి పూర్తి వివరాల కోసం కొన్నాళ్ళు ఓపిక పట్టాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :