“రాధేశ్యామ్” ఈవెంట్‌లో గాయపడిన అభిమానులకు ప్రభాస్ సాయం..!

Published on Dec 31, 2021 2:03 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కిన పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు కటౌట్ కిందపడి ముగ్గురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే గాయపడ్డ వారి గురుంచి తెలుసుకున్న ప్రభాస్ వారికి ఆర్థిక సాయం చేసినట్టు తెలుస్తుంది. ఇదివరకు ఎన్నో సార్లు కష్టాల్లో తన ఫ్యాన్స్‌ను ఆదుకున్న ప్రభాస్, తాజాగా మరోసారి గాయపడిన అభిమానులకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవడంతో ఫ్యాన్స్ ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :