క్లారిటి ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్ !
Published on Nov 20, 2017 3:47 pm IST

‘మిర్చి, మిరపకాయ్’ సినిమా లతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రిచా గంగోపాద్యాయ రహస్యంగా పెళ్లి చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా రిచా స్పందించింది. సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, వాటిని కాదని సినీ జీవితానికి పూర్తిగా స్వస్తి పలికిన రిచా ఇప్పుడు అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటోంది.

తనకు పెళ్లి కాలేదని ఇప్పట్లో చేసుకొనే ఉద్దేశం లేదని ఆమె వెల్లడించింది. గత ఐదు ఏళ్లుగా రిచా సినిమాలు చెయ్యడం లేదు. ఈ మధ్యే తను డిగ్రీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తూ కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడు ఇలా సినిమాలు దూరమై ఫ్యామిలీ లైఫ్ ని గడిపేస్తోంది రిచా గంగోపాధ్యాయ.

 
Like us on Facebook