తరువాతి సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్

Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత 3 సంవత్సరాలుగా ఏ సినిమా చేయకుండా మొత్తం సమయాన్ని ‘బాహుబలి’ కోసం రాజమౌళికి అప్పగించేశాడు. అందుకు తగ్గట్టుగానే బాహుబలి మొదటి పార్ట్ భారీ స్థాయి విజయాన్ని సాధించి ప్రభాస్ ను నేషనల్ లెవల్ లో పాపులర్ చేసింది. ఇక బాహుబలి సెకండ్ పార్ట్ కూడా పూర్తి కావస్తుండటంతో ప్రభాస్ తన తరువాతి సినిమాలపై దృష్టి పెట్టాడు. బాహుబలి తరువాత తాను చేయబోయే చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు.

బాలీవుడ్ లో బాహుబలి చిత్రంతో ఏ తెలుగు హీరోకి రాని క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ సుజిత్ డైరెక్షన్లో చేయనున్న తన తరువాతి చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. మొదట రూ.60 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళంలలో రిలీజ్ చేయాలని భావించినా ‘బాహుబలి – 2’ బిజినెస్ చూసి హిందీలో కూడా రిలీజ్ చేయాలని, ఖచ్చితంగా, మంచి ఫలితం ఉంటుందని భావించిన ప్రభాస్ బడ్జెట్ ను రూ. 100 కోట్లకు పెంచారని వినికిడి. ఇకపోతే సుజిత్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన యువి క్రియేషన్స్ ప్రమోద్, వంశీ లు నిర్మించనున్నారు.