నా ఫ్యాన్స్ కోసం ఏడాదికి 300 రోజులు పని చేస్తాను – ప్రభాస్

Published on Mar 7, 2022 9:08 am IST

రానున్న రెండేళ్లలో తన నుంచి మరిన్ని సినిమాలు రానున్నాయి అని, ఇక నుంచి ఆ సినిమాలకు సంబంధించి వరుస అప్ డేట్ లు కూడా రిలీజ్‌ కానున్నాయని.. కేవలం తన అభిమానులకు మరింతగా దగ్గర కావడానికే తానూ చేయగలిగినదంతా చేస్తాను అని ప్రభాస్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

ఇంతకీ తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి ప్రభాస్ అసలు ఏమి మాట్లాడాడు అంటే.. “మీ అందరినీ (అభిమానులు) ఎక్కువ వెయిట్ చేయించినందుకు క్షమించండి. ఇక నుంచి నా నుంచి వరుస సినిమాలు రానున్నాయి. నా ఫ్యాన్స్ హ్యాపినెస్ కోసం నేను ఏడాదికి 300 రోజులు పని చేస్తాను. నాకు మీ సపోర్ట్‌ ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ ప్రభాస్ తన అభిమానుల గురించి మాట్లాడుతూ ఇలా ఓపెన్ అయ్యాడు.

కాగా ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :