ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ప్రభాస్ సాలిడ్ క్లారిటీ.!

Published on Mar 3, 2022 9:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “రాధే శ్యామ్” ఇప్పుడు ఏ స్థాయి అంచనాలు నెలకొల్పుకుందో చూస్తున్నాము. ఇక నిన్న వచ్చిన రెండో ట్రైలర్ తో అయితే ఆ అంచనాలు మరింత పీక్స్ లోకి వెళ్లాయి.

మరి ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రభాస్ ఈ సినిమా కోసం మరియు తన ఫ్యూచర్ సినిమాలు కోసం కూడా పలు ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది. అయితే తాను చేసే ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నానని ఇక మీద తన నుంచి వచ్చే అన్ని సినిమాలు కూడా అలాగే ఉంటాయన ..

రొటీన్ సినిమాలు మాత్రం చేసి నన్ను నేను బోర్ కొట్టించేలా చూపించడం ఇష్టం లేదని ప్రభాస్ సాలిడ్ క్లారిటీ ఇచ్చాడు. అంటే ఇక నుంచి ప్రభాస్ చేసే ప్రతి సినిమా కూడా కొత్తదనంతో కూడుకున్న సబ్జెక్టు తోనే వస్తుందని చెప్పాలి. ప్రస్తుతం తన రాధే శ్యామ్ అయితే ఈ మార్చ్ 11న భారీ స్థాయి రిలీజ్ తో రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :