ఇన్‌స్టాలో రెబల్ స్టార్ ప్రభాస్ మరో ప్రభంజనం..!

Published on Sep 7, 2021 7:35 am IST

రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి పెద్దగా చెప్పక్కర్లేదు. ఈ పాన్ ఇండియా స్టార్ ఇన్‌స్టాగ్రామ్ లో 7 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. రెండేళ్ల క్రితం ఇన్‌స్టాలో ఖాతా తెరిచిన ప్రభాస్ తనకున్న క్రేజ్‌తో ఫాలోవర్లను పెంచుకుంటూ పోతున్నాడు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’, ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలు విడుదల కానున్నాయి. వీటి తర్వాత ప్రభాస్ తన 24వ చిత్రాన్ని నాగ్ అశ్విన్‌తో చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :