“ఆదిపురుష్” పై ప్రభాస్ నిజంగానే ఈ మాటలు అన్నాడా.?

Published on Apr 1, 2022 10:02 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాలిడ్ కం బ్యాక్ కోసం అతడి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది మాత్రం ప్రభాస్ నెక్స్ట్ మరియు బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయినటువంటి చిత్రం “ఆదిపురుష్” తోనే తీరాలి అని డార్లింగ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యిపోయారు.

మరి దీనిపై ఆల్రెడీ పలు ఊహాగానాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ రామ నవమికే ఈ సినిమా నుంచి ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ టీజర్ ని కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మరి వీటితో పాటుగా ప్రభాస్ ఈ సినిమా విషయంలో పలు ఆసక్తికర కామెంట్స్ చేసినట్టు కొన్ని మాటలు వైరల్ గా మారాయి.

ఆదిపురుష్ సినిమా నాకు పర్సనల్ గా మరియు సెంటిమెంటల్ గా చాలా దగ్గరైన సినిమా అని అంతే కాకుండా ఇది రెగ్యులర్ సినిమాల్లా కాకుండా వేరే ఏదో ఒక్క కొత్త దానిలా అనిపిస్తుంది అని చాలా ముఖ్యమైన సినిమా ఇది అని తెలిపాడట. అయితే ఈ మాటలు ఎప్పుడు ఎక్కడ అన్నాడో కానీ ప్రస్తుతం అయితే ప్రభాస్ మాటలు గానే సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :