‘ప్రభాస్‌’ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదా ?

Published on Feb 13, 2023 1:00 pm IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు గానూ ప్రభాస్ తన రెమ్యునరేషన్ ను తీసుకోవడం లేదని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా బడ్జెట్‌ను అదుపులో ఉంచాలానే ఉద్దేశంతోనే ప్రభాస్ రెమ్యునరేశన్ తీసుకోవట్లేదట. అయితే, ఈ సినిమాకు వచ్చే లాభాల్లో ప్రభాస్ వాటా తీసుకుంటాడని తెలుస్తోంది. అయితే, ఈ వార్త పై ఇంతవరకు ఎలాంటి అధికారిక అప్ డేట్ అయితే రాలేదు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు మారుతి ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నాడు. అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అన్నట్టు ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందట. కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే.

సంబంధిత సమాచారం :