‘ప్రభాస్‌ – మారుతి’ సినిమా షూట్ కి బ్రేక్ ?

‘ప్రభాస్‌ – మారుతి’ సినిమా షూట్ కి బ్రేక్ ?

Published on Feb 8, 2023 12:27 AM IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది అని తెలుస్తోంది. ప్రభాస్‌కు తాజాగా ఆరోగ్యం బాగా లేదట. జ్వరంతో ప్రభాస్ బాధపడుతున్నాడని, అందుకే మారుతి సినిమా షూటింగ్‌ ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలో ఇంతవరకు ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు మారుతి ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నాడు. అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అన్నట్టు ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందట. కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు