ఇంటర్వ్యూ : మంచు లక్ష్మి – ఒక్క ప్రభాస్ ని తప్ప అందరినీ పిలిచాను !

ఇంటర్వ్యూ : మంచు లక్ష్మి – ఒక్క ప్రభాస్ ని తప్ప అందరినీ పిలిచాను !

Published on Oct 6, 2016 6:25 PM IST

lakshmi-manchu
అటు సినిమా రంగంలోనూ, ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే నటి మంచు లక్ష్మి. ఈ నెల 8న ఆమె పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్బంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం…

ప్ర) చెప్పండి లక్ష్మిగారు ఈ సంవత్సరం ఎలా ఉంది ?
జ) ఈ సంవత్సరం చాలా బాగుంది. నా లైఫ్ లో ఈ ఇయర్ ని మర్చిపోలేను. అనుకున్నవన్నీ చాలా బాగా జరిగిపోయాయి. థిస్ ఈజ్ ద బెస్ట్ ఇయర్ ఇన్ మై లైఫ్.

ప్ర) మీ ఫ్యామిలీ అంతా ఎలా ఉంది ?
జ) అందరూ బాగున్నారు. అమ్మ, నాన్న, నా మేనకోడళ్లు అందరితో లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతోంది. ముఖ్యంగా నా కూతురు. బిడ్డ పుడితే ఎలా చేయాలి, టైమ్ సరిపోదు కదా అని కంగారు పడ్డాను. కానీ నా పాప వచ్చాక నా ప్రపంచమే మారిపోయింది. నా పాపే నా లోకమయింది.

ప్ర) ‘మేము సైతం’ కార్యక్రమం పట్ల మీ ఫీలింగ్ ఏమిటి ?
జ) మొదట ‘మేము సైతం’ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు నేను పదిమందికి హెల్ప్ చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది. కానీ ప్రోగ్రామ్ చేశాక వాళ్ళే నాకు హెల్ప్ చేస్తున్నారు అనిపిస్తోంది. మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా తయారయ్యాను. భాధలు ఎలా ఉంటాయో, సహాయం ఎలా చేయాలో తెలుసుకున్నాను.

ప్ర) మీరు షో కి పిలిచి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ?
జ) దాదాపు అందరినీ నా షోకి పిలిచాను. రాని వాళ్ళు చాలామందున్నారు. కొందరు వస్తామని చెప్పి రానివాళ్లున్నారు. ఎందుకో వాళ్ళు మీరు మీలా ఉండండి అంటే భయపడతారు. రానివాళ్ళకి సహాయం చేసే అదృష్టం లేదనే అనుకుంటాను.

ప్ర) ఎందుకు ఎప్పుడూ మీకు ఎదో ఒకటి కొత్తగా చేయాలనిపిస్తుంది ?
జ) నాకు ఎప్పుడూ కొత్తదనమే ఇష్టం. అందరిలోకీ స్పెషల్ గా ఉండాలని అనుకుంటాను. మిగతా వాళ్ళందరూ చేసేది నేను చేయను. నేను చేసేది వాళ్ళెవరూ చేయలేరు(నవ్వుతూ). ఇది కాంపిటిషన్ తో కూడుకున్న పరిశ్రమ. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్తగా ఉండేలా చూసుకోవాలి.

ప్ర) పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా ఏమన్నా ఒప్పుకున్నారా ?
జ) ఇప్పుడే చెప్పకూడదనున్నాను. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తున్నాను. ఈ మధ్యే ఓ సినిమా ఒప్పుకున్నాను. అది కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండే సినిమా.

ప్ర) మీ షోకి ఇప్పటి వరకూ పిలవని సెలబ్రెటీ ఎవరన్నా ఉన్నారా ?
జ) ఉన్నారు. ఇప్పటి వరకూ నేను హీరో ప్రభాస్ ని నా షోకి పిలవలేదు. ఎందుకంటే ఆయన ‘బాహుబలి ‘ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. మళ్ళీ పిలిస్తే రాజమౌళిగారికి కోపం వస్తుంది(నవ్వుతూ). అందుకే ఆయన్ను ఇప్పటివరకూ పిలవలేదు.

ప్ర) మీ నెక్స్ట్ సినిమాకి ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్ ఎలా పెట్టారు. సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఆ టైటిల్ నిర్మాతలు కథ చెప్పేటప్పుడే నిర్ణయించేసుకుని నాకు చెప్పారు. మొదట నచ్చలేదు. వర్కింగ్ టైటిల్ గా ఉంచి తరువాత చూద్దాం అన్నాను. కానీ వాళ్ళు మాత్రం అదే ఉంచాలన్నారు. తరువాత కథ చూస్తే అదే కరెక్ట్ అనిపంచింది. అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ, హర్రర్ డ్రామాగా ఉంటుంది.

ప్ర) మీకు ఫ్యూచర్ లో గోల్స్ ఎమన్నా ఉన్నాయా ?
జ) నాకైతే ఎలాంటివో గోల్స్, టార్గెట్స్ లేవు. మా కుటుంబమంతా బ్రతికేది కళామతల్లి వలనే. కాబట్టి ఎప్పటికీ సినిమాలు చేస్తూ ఒక మంచి ఆర్టిస్ట్ గానే ఉండిపోవాలన్నది నా ఆశ.

ప్ర) ఏ సెలబ్రిటీతో షో చేస్తే ఎక్కువ ఫండ్స్ వచ్చాయి ?
జ) నేనెప్పుడూ అది చూడను. పలానా సెలబ్రటీ షో చేస్తే ఎక్కువ ఫండ్స్ వస్తాయి. వాళ్ళతోనే చేయాలి అని అనుకోలేదు. సహాయం ఎవరు చేసినా సంతోషమే. నా షోకి వచ్చిన వాళ్లంతా షో పూర్తయ్యాక ఇస్తామన్న టైమ్ కి డబ్బులు ఇచ్చేశారు. అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు.

ప్ర) మీకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా ?
జ) నాన్నతో ఓ ఫుల్ లెంగ్త్ సినిమా తీయాలని ఉంది. కానీ మంచి కథ దొరకడం లేదు. కథ ఎలా ఉండాలంటే నటిగా నాకు సవాల్ విసిరేలా ఉండాలి. అలాంటి కథ దొరికితే నేను తప్పకండా చేస్తాను.

ప్ర) పరిశ్రమలో ఏమన్నా మార్పులు కోరుకుంటున్నారా ?
జ) అవును. పరిశ్రమలో ఓ మార్పు రావాలని అనుకుంటున్నాను. అదేమిటంటే బాగా చదువుకున్న ఆడవాళ్లు పరిశ్రమలోకి రావాలి, మంచి మంచి సినిమాల్లో నటించాలి. ఇప్పటికి పరిశ్రమలో ఆడవాళ సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఆడవాళ్లు ముందుకొచ్చి సినిమాలు చేయాలనేది నా కోరిక.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు