ఆ సర్వేలో నంబర్ 1 ప్లేస్ కొట్టేసిన ప్రభాస్..!

Published on Dec 10, 2021 3:00 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించాడు. బాహుబలి, సాహో లాంటి చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తాజాగా సౌత్ హీరోలలో మరెవ్వరికీ సాధ్యం కానీ అరుదైన ఫీట్ అందుకున్నాడు. 2021 ఏడాదికి సంబంధించిన నం.1 సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్ నిలిచాడు. యునైటెడ్ కింగ్‌డ‌మ్‌ ఈస్టర్న్ ఐ వీక్లి అనే ప్రముఖ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో ప్రభాస్ మొదటి స్థానాన్ని పొందాడు.

అయితే ఈ జాబితాలో మొత్తం ఆసియా నుంచి 50 మంది సెలబ్రెటీలు పోటీపడగా, అందరిలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ ‘సలార్’, ఓం రౌత్ ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :