“కల్కి 2898ఎడి” యూనిట్ కూడా కేసు ఫైల్ చేస్తున్నారట..

Published on Sep 17, 2023 9:00 am IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “కల్కి 2898ఎడి”. మరి ఈ చిత్రం అయితే ఇండియన్ సినిమా దగ్గర ఒక గేమ్ ఛేంజింగ్ ప్రాజెక్ట్ గా రాబోతుండగా రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న “గేమ్ చేంజర్” చిత్రం నుంచి సాంగ్ లీక్ కాగా దాని విషయంలో మేకర్స్ కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే బాటలో కల్కి యూనిట్ కూడా తాము వర్క్ ఇచ్చిన వి ఎఫ్ ఎక్స్ ఓ కంపెనీ పై కేసు పెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనికి కారణం సినిమా నుంచి వచ్చిన అనివార్య లీక్స్ వల్లనే అని తెలుస్తుంది. మరి దీనిపై రానున్న రోజుల్లో అసలు ప్రోగ్రెస్ అయితే కనిపించనుంది. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :