మొగల్తూరులో ల్యాండ్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్!

Published on Sep 29, 2022 12:30 pm IST

కొద్ది రోజుల క్రితం ప్రభాస్ తన తండ్రి సమానులైన పెద్దనాన్న కృష్ణంరాజు ను కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే. కృష్ణం రాజు మృతి తో ప్రభాస్, అతని కుటుంబం చాలా దుఃఖంలోకి వెళ్ళింది. ఇప్పుడు వారు కృష్ణంరాజు జన్మస్థలం అయిన మొగల్తూరు లో ఉన్నారు.

కుటుంబ సమేతంగా పట్టణానికి చేరుకున్న ప్రభాస్, ఈ వార్త తెలియగానే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. మొగల్తూరు లో అన్నదానం తో పాటు ప్రత్యేక కర్మ ను నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న తన కొత్త చిత్రం సాలార్ షూటింగ్ నుండి ప్రభాస్ రెండు రోజులు విరామం తీసుకున్నాడు.

సంబంధిత సమాచారం :