హీరో గోపీచంద్ తో `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తోన్న.. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఇటలీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఇటీవలే ప్రభాస్ కూడా ఇటలీలోని చిత్రబృందంతో జాయిన్ అయ్యారు.
అయితే తాజాగా లోకేషన్లో దిగిన ప్రభాస్ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఫొటోలో ప్రభాస్ సరసన అక్కడి లోకల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఫొటోలోని ప్రభాస్ లుక్ కాస్త కొత్తగా ఉండటంతో.. ముఖ్యంగా మీసాలు లేని ప్రభాస్ ముఖంలో గ్లో కనిపిస్తుండటంతో ఈ ఫోటో పై ప్రభాస్ అభిమానులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.
కాగా మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2019 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తుంది.
