వైరల్ అవుతోన్న రెబల్ స్టార్ “ప్రభాస్” స్టైలిష్ ఫోటో!

Published on Jun 13, 2022 1:12 pm IST


యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సలార్ షూటింగ్ లో ఉన్న ప్రభాస్, ప్రస్తుతం తన లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటో లో ప్రభాస్ చాలా ఫిట్ గా, స్లిమ్ గా మరియు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రభాస్ రాధే శ్యామ్ సమయం లో కాస్త బొద్దుగా కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా కి సినిమా కి గ్యాప్ లేకుండా పని చేస్తూ ఉండటం తో ప్రభాస్ తన బాడీ పై అశ్రద్ద వహించాడు అంటూ గతం లో కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్ ఫోటో బయటికి రావడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ సలార్ మాత్రమే కాకుండా, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే లతో పాటుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రం కూడా ఉన్నాయి. ఈ క్రేజీ లైనప్ తో ప్రభాస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాడు.

సంబంధిత సమాచారం :