“ప్రాజెక్ట్ కే” సెట్స్ లో దూసుకెళ్తున్న ప్రభాస్..వీడియో వైరల్.!

Published on Jul 20, 2022 6:36 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ స్థాయి సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో పాన్ ఆసియ నుంచి పాన్ వరల్డ్ లెవెల్లో కూడా తెరకెక్కుతున్న సినిమాలు ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం “ప్రాజెక్ట్ కే”.

ఇండియన్ సినిమా దగ్గర ఒక భారీ స్కై ఫై కం ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం భారీ సెట్స్ సహా సినిమా ప్రధాన తారాగణం నడుమ శరవేగంగా జరుగుతుంది. అయితే నిన్నటి నుంచి ఈ సినిమాపై టాక్ మంచి వైరల్ గా మారగా ఇప్పుడు ఈ సినిమా సెట్స్ లో ప్రభాస్ అంటూ ఓ వీడియో మంచి వైరల్ గా మారింది.

ప్రభాస్ తన లగ్జరి కార్ లాంబోర్గిని వెస్కొని సినిమా షూటింగ్ కోసమో లేక షూటింగ్ అయ్యాకో గాని జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోయాడు. దీనితో ఈ చిన్న బిట్ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ అలాగే హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :