ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బైకర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ ఇండియన్ బైక్ రేసింగ్ చిత్రంగా ఈ మూవీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం రేసింగ్ అంశాలతో పాటు ఎంగేజింగ్‌గా సాగడంతో ఈ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. తాజాగా ఈ ట్రైలర్ పై పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
తన ఇన్‌స్టా అకౌంట్ వేదికగా ‘బైకర్’ మూవీ ట్రైలర్ వైబ్ అదిరిపోయిందంటూ ప్రభాస్ కామెంట్ చేశాడు. ఈ ట్రైలర్ ఎంగేజింగ్‌గా ఉందని.. శర్వా, యూవీ క్రియేషన్స్ అండ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చాడు ప్రభాస్.ఈ సినిమాతో వారు భారీ విజయాన్ని అందుకోవాలని ప్రభాస్ ఆకాంక్షించాడు.
శర్వా సరికొత్త లుక్, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పవర్‌ఫుల్ రోల్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా భారీ క్యాస్టింగ్ ఇందులో నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
