రౌడీ బాయ్స్ కోసం ప్రభాస్…యే జిందగీ సాంగ్ విడుదల!

Published on Jan 12, 2022 12:30 pm IST

ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా హర్ష కొనుగంటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రం ను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి మరొక సాంగ్ విడుదల అయ్యింది. యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా మూవీ హీరో అయిన ప్రభాస్ ఈ చిత్రం నుండి యే జిందగీ అనే పాటను విడుదల చేయడం జరిగింది. జనవరి 14 వ తేదీన విడుదల కానున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :