‘సాహో’ కోసం కొత్త విద్యను నేర్చుకుంటున్న ప్రభాస్ !


‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ‘సాహో’ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకోవాలని చిత్ర టీమ్ కూడా కఠోరంగా ప్రయత్నిస్తోంది. సుమారు రూ.150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాను విఎఫ్ఎక్స్ సాయంతో విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. అంతేగాక ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా హెవీ యాక్షన్ ఎపిసోడ్లను కూడా రూపొందిస్తున్నారు.

హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ వీటిని రూపొందిస్తున్నారు. ఇక ప్రభాస్ అయితే వీటి కోసం ప్రత్యేకంగా ఒక కొత్త విద్యనే నేర్చుకుంటున్నారని సమాచారం. అదేమిటంటే ఈ సినిమాలో అండర్ వాటర్ లో జరిగే ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుందట. దాని కోసం ప్రభాస్ అండర్ వాటర్ డైవింగ్ అనగా స్కూబా డైవింగ్ నేర్చుకుంటున్నారట. సుజీత్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ ను ఫైనల్ చేశారు.