జాన్ సినిమాలో ప్రభాస్ సరికొత్తగా… !

Prabhas2

సాహో లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తరువాత ప్రభాస్ చేసే చిత్రం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. ప్రభాస్ ప్రస్తుతం జాన్ అనే చిత్రం లో నటిస్తున్నారు. ఐతే ఈ చిత్రం పీరియాడిక్ లవ్ స్టోరీ అని గతంలో ప్రభాస్ చెప్పారు. అలాగే ఈ చిత్ర ప్రధాన భాగం యూరప్ నేపథ్యంలో సాగుతుందని ఆయన చెప్పడం జరిగింది. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ లుక్, పాత్ర తీరు వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. 1960 నాటి వస్త్ర ధారణలో ప్రభాస్ సరికొత్తగా కనిపిస్తారట. దీనికోసం ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారట.

లవ్ స్టోరీ బేస్డ్ చిత్రం కావడంతో రొమాంటిక్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. ఈ చిత్రం ప్రభాస్ గతంలో చేసిన వర్షం, డార్లింగ్ వంటి ప్రేమ కథా చిత్రాలను గుర్తు చేసేదిలా ఉంటుందట. ఇక దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

Exit mobile version