ఇంట్రెస్టింగ్..”సలార్” లో మరింత ధృడంగా ప్రభాస్ లుక్.?

Published on May 24, 2022 1:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్ లో భారీ సినిమాలు షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఒక అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ మాస్ రోల్ లో కనిపిస్తున్నట్టు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పటి వరకు కొన్ని సాలిడ్ పోస్టర్ లు అలాగే కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకి బయటకి వచ్చాయి.

అయితే లేటెస్ట్ గా మరో లుక్ సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. ఇది చూస్తే మాత్రం ఈ సినిమాలో ప్రభాస్ మరింత లుక్ మరింత ధృడంగా ఉందని చెప్పాలి. లాస్ట్ టైం కాస్త మాస్ లుక్ లో కనిపించిన సాహో ని మించి సలార్ లో అయితే ఇప్పుడు ప్రభాస్ కనిపిస్తున్నాడని చెప్పాలి. మరి ఈ సినిమాలో నీల్ టేకింగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి కూడా రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :