వీడియో కాల్ చేసి అభిమాని కోరిక తీర్చిన ప్రభాస్..!

Published on Sep 19, 2021 1:27 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఓ అభిమాని కోరిక తీర్చి ఆమె ముఖంపై చిరునవ్వులు చిందేలా చేశాడు. కొద్ది రోజుల నుంచి శోభిత అనే అమ్మాయి అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

అయితే వైద్యులు ఆమె ఇష్టాఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, ఒక్కసారి ఆయనతో మాట్లాడాలని ఉన్నట్టు చెప్పింది. అయితే శోభిత కోరికను తెలుసుకున్న ప్రభాస్ నేడు వీడియో కాల్ ద్వారా ఆమెతో మాట్లాడారు. త్వరగా కోలుకుంటున్నావని ఆమెకు ధైర్యం చెప్పాడు. తన అభిమాన నటుడితో మాట్లాడినందుకు ఆమె సంతోషానికి అవద్ధులేక్కుండా పోయాయి.

సంబంధిత సమాచారం :