అనుష్క గురించి రూమర్లు, మ్యారేజ్ పై స్పందించిన ప్రభాస్..!


గత రెండేళ్ల నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించిన అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. భాహుబలి చిత్రం పూర్తవగానే ప్రభాస్ వివాహం జరుగుతుందని అంతా భావించారు. కానీ ప్రభాస్ మాత్రం సాహో చిత్ర షూటింగ్ లో బిజీ అయిపోయాడు.

జాతీయ మీడియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన వివాహం గురించి స్పందించాడు. తనకు ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని ప్రభాస్ తెలిపాడు. దీనిపై సరదాగా స్పందిస్తూ తన లేడీ ఫాన్స్ ఈ విషయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నాడు. అనుష్క తో పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై కూడా ప్రభాస్ మాట్లాడాడు. ఇలాంటి రూమర్లు సహజమే అని అన్నాడు. ఓ నటితో రెండు లేదా అంతకంటే ఎక్కువ చిత్రాల్లో నటించగానే ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని ప్రభాస్ తెలిపాడు. గతం లో ఈ రూమర్ల గురించి తాను బాధపడే వాడినని, ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని ప్రభాస్ తెలిపాడు.