ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వివరాలు ఆ రోజు ప్రకటిస్తారట ?

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక క‌థ‌నాలు వస్తూనే ఉన్నాయి. కాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ప్రభాస్ పెళ్లి గురించి ఆయన కుంటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23న.. అంటే ఆ రోజునే ఆయన పెళ్లికి సంబంధించిన వివరాలను.. ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ చిత్రం చేయనున్నాడు. ఇది పీరియాడిక్ చిత్రమని, కథ వైవిధ్యంగా ఉంటుందని సమాచారం.

Exit mobile version