“రాధే శ్యామ్” ఇంట్రెస్టింగ్ ప్రశ్నపై ప్రభాస్ మాస్ రిప్లై వైరల్.!

Published on Mar 5, 2022 11:00 am IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి సిద్ధం అవుతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” మొదటి వరసలో ఉంది. మరి జస్ట్ కొన్ని రోజుల్లోనే రిలీజ్ కాబోతున్న ఈ భారీ సినిమా ప్రమోషన్స్ లో డార్లింగ్ ప్రభాస్ మరియు చిత్ర యూనిట్ అంతా బిజీగా ఉన్నారు.

మరి లేటెస్ట్ గా అయితే తమిళనాడులో ప్రమోషన్స్ కి చిత్ర యూనిట్ వెళ్లగా అక్కడ మీడియా నుంచి ప్రభాస్ కి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. అసలు ఈ సినిమా తెరకెక్కిన మెయిన్ కాన్సెప్ట్ లవ్ వర్సెస్ డెస్టినీ(ప్రేమకి విధికి) జరిగే యుద్ధంలో ఏది గెలుస్తుందని వారు అడగ్గా ప్రభాస్ మాస్ రిప్లై ఇచ్చాడు.

దానికి సమాధానం కనీసం 50 రూపాయల టికెట్ కొనుకొని సినిమా చూసి తెలుసుకోండి అని అసలే మా ప్రొడ్యూసర్ ఈ సినిమా 300 కోట్లు పెట్టి తీసాడని నవ్వుతూ చెప్పాడు. దీనితో ఈ వీడియో క్లిప్ మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :