రికార్డుల ర్యాంప్ స్టార్ట్ చేసిన ప్రభాస్ మాసివ్ ఎపిసోడ్.!

రికార్డుల ర్యాంప్ స్టార్ట్ చేసిన ప్రభాస్ మాసివ్ ఎపిసోడ్.!

Published on Dec 30, 2022 11:02 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలతో పాటుగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న “ఆహా” షో “అన్ స్టాప్పబుల్ 2” కి గాను గెస్ట్ గా హాజరయ్యి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని అయితే అందించాడు. మరి రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ క్రేజీ ఎపిసోడ్ నిన్న రాత్రి ఆహాలో స్ట్రీమింగ్ కి రాగా ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి ఆ యాప్ క్రాష్ అయ్యిపోయింది.

ఇక వెంటనే ఈ ఇష్యూ ని బృందం సెట్ చేయగా తర్వాత రికార్డులు కొల్లగొట్టే పనిలో ఈ ఎపిసోడ్ పడింది. మరి ఈ మాసివ్ ఎపిసోడ్ అయితే మొదటి 12 గంటల్లో భారీ రికార్డులు సృష్టించినట్టుగా “ఆహా” వారు అనౌన్స్ చేశారు. మరి మొదటి 12 గంటల్లో అయితే ఈ ఎపిసోడ్ ఏకంగా 50 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ని నమోదు చేసిందట. దీనితో ఈ ఎపిసోడ్ కి ఏ లెవెల్లో రెస్పాన్స్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఎంతో ఆసక్తిగా సాగిన ఈ ఎపిసోడ్ రెండో భాగం అయితే తర్వాత స్ట్రీమింగ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు