“సిరి వెన్నెల” గారి కుటుంబాన్ని కలసిన పాన్ ఇండియా స్టార్.!

Published on Jan 5, 2022 7:01 am IST

గత కొన్ని వారాల కితమే తెలుగు నేలకు, తెలుగు సినిమాకి చెందిన దిగ్గజాలలో ఒకరైన ప్రఖ్యాత సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తన తుది శ్వాస విడిచి స్వర్గస్తులు అయ్యారు. అయితే ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు ఎంతో మంది తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అయితే ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సిరి వెన్నెల గారు కుటుంబాన్ని ప్రత్యేకంగా కలసి వారిని పరామర్శించినట్టు తెలుస్తోంది.

నిన్న రాత్రి ప్రభాస్ వారి సిరి వెన్నెల స్వగృహానికి వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పాడట. ఇప్పుడు ఈ సంబంధిత వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఇదిలా ఉండగా గత కొన్నాళ్ల కితమే కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటుడు పునీత్ మరణించిన సంగతి తెలిసిందే. వారి కుటుంబాన్ని కూడా ప్రభాస్ కొన్ని రోజులు కితమే కలసి పరామర్శించారు.

సంబంధిత సమాచారం :