ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రభాస్ సినిమా ప్రీమియర్ షోలు !


‘బాహుబలి’ సినిమా సాధించిన విజయంతో హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ దక్కింది. ఆయన తర్వాత చేయబోయే సినిమాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే ప్రభాస్ చేయబోయే తర్వాతి సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రీమియర్ల రూపంలో ప్రదర్శించాలనే ఆలోచనలు జరుగుతున్నాయట.

సుజీత్ తో చేస్తున్న ‘సాహో’ కాకుండా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ను చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ముందుగా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తారట. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను ప్రపంచం స్థాయి విలువలతో తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్, సాంకేతిక నిపుణులు ఎవరు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version